హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యారంగాన్ని కాంగ్రెస్ సర్కార్ భ్రష్టు పట్టిస్తున్నదని, ఓ వైపు ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరోవైపు ప్రైవేట్ విద్యను పేద, మధ్యతరగతి విద్యార్థులకు అందకుండా పిల్లల జీవితాలతో రేవంత్‌రెడ్డి సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. వేలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థులకు కా ర్పొరేట్ స్థాయి విద్యనందించిన గురుకులాలను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డా రు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారం అందించకుండా భద్రత పరంగా విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. గురుకుల భవనాలకు కనీసం అద్దె కూడా చెల్లించకుండా తాళాలు వేసే దుస్థితి మునుపెన్నడూ రాలేదని వా పోయారు.
ఫీజు రీయింబర్స్మెంట్, సా లర్షిప్లను చెల్లించకుండా విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేస్తూ, ప్రైవేట్ కాలేజ్‌లకు ఫీజులు చెల్లించకపోవటమంటే పేద, మధ్యతరగతి విద్యార్థులను చదువుకు దూరం చేయటమేనని స్పష్టంచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజ్‌లు నిరవధికంగా బంద్ చేయటం సిగ్గుచేటని విమర్శించారు. కాలేజీలు బంద్ పెడ్తామని యాజమాన్యా లు హెచ్చరించినా స్పందించకపోవడం ప్ర భుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని మండిపడ్డారు. బకాయిల కోసం యాజమాన్యాలు, సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు.
2వేల కోట్ల బకాయిలు చెల్లించినం
మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెప్తున్న ప్రభుత్వం పేద, మధ్య తరగతి విద్యార్థుల చదువు కోసం ఖర్చుపెట్టలేదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పడేనాటికి గత ప్రభుత్వాలు పెట్టిన రూ.2 వేల కోట్ల బకాయిలను విద్యార్థులకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం చెల్లించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులపట్ల చిత్తశుద్ధి ఉంటే కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరిపి బకాయిలు చెల్లించి ఉండేదని చెప్పారు.
పోరాటం చేస్తం
రేవంత్‌రెడ్డి సరార్కు పరిపాలన అనుభవం లేదని, పేదల బాధలు తెలియవని, అందుకే విద్యార్థులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వం సమస్యల పరిషారానికి చొరవ చూపాలని, విద్యార్థులకు నష్టం చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, రెండు మూడు రోజుల్లో పరిష్కారం చూపకుంటే విద్యార్థులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
రాష్ర్టానికి విద్యాశాఖ మంత్రి లేడు.
ముఖ్యమంత్రికి విద్యారంగ సమస్యలు తెలుసుకునే ఓపిక లేదు.. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పేద, మధ్యతరగతి విద్యార్థులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చేదా?
– కేటీఆర్