KTR | హైదరాబాద్, ఆగస్టు 17 (నమస్తే తెలంగా ణ): ప్రతి రైతుకు రుణమాఫీ జరగాలన్నదే తమ ఉద్దేశమని, దీని కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. గ్రామస్థాయిలో రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వంపై బీఆర్ఎస్ పరంగా ఒత్తిడి తెస్తామని తెలిపారు. శనివారం తెలంగాణభవన్‌లో మీడియాతో ఇ ష్టాగోష్ఠిలో పాల్గొన్న ఆయన.. రాష్ట్రవ్యాప్తంగా 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యిందని, మిగిలిన వారికి కాలేదని, ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో రైతుల వివరాలను సేకరించాలని నిర్ణయించామని అన్నారు. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వివరాలు సేకరిస్తామని చెప్పారు.
973 పీఏసీఎస్‌ల్లో చై ర్మన్లు, డైరెక్టర్లు బీఆర్ఎస్ వాళ్లేనని, రైతుబం ధు సమితి సభ్యులతో తమకు బలమైన వ్యవ స్థ ఉన్నదని, వారి ద్వారా వివరాలను సేకరిస్తామని వెల్లడించారు. ఒక్కో నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సీనియర్ నాయకులు బాధ్యత తీసుకుంటార ని వివరించారు. వారం పాటు ఈ ప్రక్రియ కొ నసాగుతుందని ప్రకటించారు. ముందుగా ప్ర తి మంత్రి నియోజకవర్గం నుంచి సీఎం ని యోజకవర్గం వరకు వివరాలు సేకరించి ప్రభుత్వానికి అందిస్తామని, జిల్లా కలెక్టర్లను కలిసి వినతిపత్రం ఇస్తామని వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రస్థాయిలో వ్యవసాయశాఖ కార్యదర్శి, ఆ శాఖ మంత్రిని కలుస్తామని అన్నారు.
ఆ తర్వాత సీఎం, గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇస్తామని తెలిపా రు. ప్రభుత్వం నుంచి స్పందనరాకుంటే ప్రత్య క్ష కార్యాచరణకు దిగుతామని స్పష్టంచేశారు. రుణమాఫీపై ప్రభుత్వానికి సమయం ఇస్తున్నామని, అంతవరకు సంయమనం పాటిస్తామని చెప్పారు. రైతులకు రుణవిముక్తి చేయాలన్నదే తమ లక్ష్యమని తేల్చిచెప్పారు. రైతులు అసంతృప్తి, అసహనంతో ఉ న్నారని అన్నారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని విఫలమయ్యారని, భంగపడ్డారని తెలిపారు. వంద శాతం రుణమాఫీ అయ్యిందని చెప్పి.. కలెక్టరేట్లలో రుణమాఫీ కానివాళ్ల కోసం ప్రత్యేక కౌంటర్లు ఎందుకు పెట్టారని నిలదీశారు.
47 లక్షల్లో 22 లక్షల మందికేనా?
47 లక్షల మందికి రూ.49 వేల కోట్లు రుణమాఫీకి కావాలని స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశంలో తేల్చారని కేటీఆర్ గుర్తుచేశారు. అయితే రుణమాఫీకి రూ.31 వేల కోట్లు అంటూ క్యాబినెట్ తీర్మానం చేసి, రూ.26 వేల కోట్లకు బడ్జెట్ ఆమోదించిందని, చివరికి రూ.17 వేల కోట్లతో మమ అనిపించారని ఆరోపించారు. 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని, మిగతా 25 లక్షల రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రుణమాఫీపై బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన కాల్‌సెంటర్‌కు దాదాపు 1.20 లక్షల ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. రైతు రుణమాఫీ విఫలమైన నేపథ్యంలో దాన్నుంచి దృష్టిమళ్లించే చర్యలకు కాంగ్రెస్ దిగుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేయించటం దేనికి సంకేతం అని నిలదీశారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే అధికారిక నివాసంపై దాడిచేసిన వారిపై ప్రభుత్వం కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి సొంత మీడియా ప్రతినిధులు కమలాసన్‌రెడ్డి లాంటి సీనియర్ అధికారిపై దాడి చేసినంత పని చేశారని, అటు.. సీఎం అధికారిక మీడియా ఆలిండియా సర్వీస్ అధికారులపై దాడి చేస్తున్నదని ఆరోపించారు.
ఫాక్స్‌కాన్ విస్తరణ లేనట్లేనా?
బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు ఫాక్స్‌కాన్ సంస్థ హైదరాబాద్‌లో లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి మాటలు, పరిపాలన వైఫల్యం వల్ల ఆ కంపెనీ వెనకి వెళ్ళిపోయిందా? 40 వేల ఉద్యోగులతో చైనా తర్వాత అతిపెద్ద రెండో క్యాంపస్‌ను బెంగళూరులో ఏర్పాటు చేస్తామని సంస్థ చెప్పటం దేనికి నిదర్శనం? అని ప్రశ్నించారు. ఫాక్స్‌కాన్ పెట్టుబడులు, విస్తరణపై నిజాలు బయటపెట్టాలని డిమాండ్‌చేశారు. ఫాక్స్‌కాన్ ఒక దశ నిర్మాణం పూర్తయ్యిందని, ప్రారంభానికి సిద్ధమైందని తెలిపారు. దీని ద్వారా 25 వేల ఉద్యోగాలు రాబోతున్నాయని, తదుపరి విస్తరణను ఫాక్స్‌కాన్ చేపడుతుందా? లేదా? అన్నది సీఎం చెప్పాలని అన్నారు. సీఎం మాటలు, దుష్ప్రచారం వల్లే ఆ కంపెనీ బెంగళూరుకు పోయిందా? అని అనిపిస్తున్నదని వెల్లడించారు.
కమిషన్ ముందుకు వెళ్తా
యథాలాపంగా చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పినా మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఈ నెల 24న మహిళా కమిషన్ ముందు హాజరవుతానని వెల్లడించారు. హాజరుకావటమే కాదు.. గత 8 నెలలుగా కాంగ్రెస్ పాలనలో మహిళలపై జరిగిన దురాగతాల వివరాలను అందజేస్తానని పేర్కొన్నారు.
గూండా రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోం: రాజీవ్‌సాగర్
రైతు రుణమాఫీ ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నివాసాలపై దాడులకు దిగుతుందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్‌సాగర్ ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీశ్‌రావు అధికారిక నివాసంపై కాంగ్రెస్ గూండాల దాడిని ఆయన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రుణమాఫీ సంపూర్ణంగా చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గుండాగిరిని సహించేదిలేదని హెచ్చరించారు.
రేవంత్ చివరి మజిలీ బీజేపీతోనేనట
సీఎం రేవంత్‌రెడ్డి తన రాజకీయ మజిలీ బీజేపీతోనేనని, త్వరలోనే తన బృందంతో ఆయన బీజేపీలో చేరటం ఖాయమని కేటీఆర్ అన్నారు. తాను పుట్టింది బీజేపీలోనేనని, చివరికి బీజేపీలోనే తన రాజకీయ ప్ర స్థానం ముగుస్తుందని, అదే జెండా కప్పుకొని చనిపోతానని ప్రధాని మోదీ, అమిత్‌షాకు రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని తెలిపా రు. తనకు ఢిల్లీ నుంచి సమాచారం అందిందని వెల్లడించారు. ఇది వాస్తవమా? కా దా? రేవంత్ చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్‌కు మోదీ అంటే భయం అన్న విషయా న్ని సన్నిహితుల వద్ద సీఎం చెప్పారని, అం దుకే కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడటానికీ భయపడ్డారని ఆరోపించారు. అదానీపై 22న ని రసన కార్యక్రమాలకు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం పిలుపునిచ్చిందని, ఈ నిరసనలో రేవంత్ పాల్గొంటారా? లేదా? చూ డాలని అన్నారు. అదానీకి పెద్ద పీట వేస్తు న్న కాంగ్రెస్ నేత రేవంత్ అని చెప్పారు.
రుణమాఫీపై బీఆర్ఎస్ కార్యాచరణ
రైతు రుణమాఫీపై పార్టీ పరంగా కార్యాచరణను రూపొందించడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావు సమావేశమయ్యారు. శనివారం తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో రుణమాఫీలో ప్రభుత్వ వైఫల్యంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలను తీసుకున్నారు. రైతులకు అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీ, ప్రజాప్రతినిధులపై ఉందని, వారికి భరోసా ఇచ్చి రుణమాఫీ అయ్యే విధంగా పోరాడాలని నిర్ణయించారు. రుణమాఫీ కాని రైతుల వివరాలను సేకరించి ప్రభుత్వ స్పందనకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, సత్యవతి రాథో డ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రె డ్డి, మాణిక్ రావు, చింత ప్రభాకర్, బండారు లక్ష్మారెడ్డి, కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు వాణిదేవి, దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.