T Padmarao – KTR | మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టీ పద్మారావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్కడే వైద్య చికిత్స తీసుకుని మంగళవారం హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయనను కేటీఆర్ ఫోన్లో పరామర్శించి.. పద్మారావు ఆరోగ్యం గురించి వాకబు చేశారు. చికిత్స పొందిన తర్వాత తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని కేటీఆర్కు పద్మారావు చెప్పారు. తగినంత విశ్రాంతి తీసుకుని మళ్లీ కార్యక్షేత్రంలోకి రావాలని పద్మారావును కేటీఆర్ కోరారు.