TASK | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు నైపుణ్యాలు పెంపొందించి, తద్వారా ఉపాధికి బాటలు వేయాలని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావించారు. అప్పుడే వారి భవిష్యత్తు తరాలు బాగుంటాయని సంకల్పించారు. ఈ క్రమంలోనే 2014లో అధికారంలోకి వచ్చీరాగానే అప్పటి బీఆర్ఎస్ సర్కారు తెలంగాణ అకాడమీ ఆఫ్ సిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్)ను లాభాపేక్షలేకుండా ప్రారంభించింది. ఇప్పుడు ఆ టాస్క్‌కు జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. పదేండ్ల కేసీఆర్ పాలనలో టాస్క్ కారణంగా లక్షలమంది యువ తీ, యువకులకు ప్రయోజనం చేకూరిందని మేధోసంస్థ నీతిఆయోగ్ ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు ‘ఎక్స్‌పాండింగ్ క్వాలిటీ హయ్యర్ ఎడ్యుకేషన్ థ్రూ స్టేట్స్ అండ్ స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్’ పేరిట విడుదల చేసిన పాలసీ రిపోర్ట్‌లో టాస్క్ సేవలను ప్రత్యేకంగా ప్రశంసించింది.
దేశ భవిష్యత్తు నిర్మాణంలో విద్యార్థులు, యువతను సంసిద్ధం చేయడంలో భాగంగా ఆయా రాష్ర్టాలు చేపట్టిన నూతన కార్యక్రమాలకు సంబంధించి నీతి ఆయోగ్ ఈ నివేదికను రూపొందించింది. మానవ వనరులకు గ్లోబల్ క్యాపిటల్‌గా భారత్‌ను తీర్చిదిద్దడంలో పలు రాష్ర్టాలు ఎంతో కృషి చేస్తున్నాయన్న నివేదిక.. ఈ క్రమంలో కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టిన టాస్క్ సేవలను ప్రత్యేకంగా అభినందించింది. నైపుణ్యాభివృద్ధితో ఎంచుకున్న రంగాల్లో రాణించడానికి అవసరమైన శిక్షణలు అందజేస్తున్న టాస్క్‌ను ఈ సందర్భంగా కొనియాడింది. స్టేట్ గుడ్ ప్రాక్టీస్ విభాగంలో టాస్క్ సేవలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. లాభాపేక్షలేని సంస్థగా బీఆర్ఎస్ ప్రభుత్వం టాస్క్‌ను ప్రారంభించినట్టు రిపోర్టులో పేర్కొంది. విద్యార్థుల్లో సాంకేతిక, వ్యక్తిగత నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతోగానో దోహదపడుతున్నదని తెలిపింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శిక్షణా కార్యక్రమాలను చేపట్టి విద్యార్థులు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను రాష్ట్రంలో గణనీయంగా పెంచినట్టు నీతిఆయోగ్ ప్రశంసించింది. విద్యార్థుల్లో పరిజ్ఞానాన్ని, నైపుణ్యాలను పెంపొందించేండమే లక్ష్యంగా 2014లో కేసీఆర్ ఆదేశాలతో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ప్రవేశపెట్టిన టాస్క్.. ఐటీ, ఐటీయేతర సేవలతో పాటు ఏరోస్పేస్, హెల్త్‌కేర్, ఫార్మా, లైఫ్‌సైన్సెస్ లాంటి ఇతర రంగాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే.
‘టాస్క్’పై నీతిఆయోగ్ ప్రశంసలు హర్షణీయం: కేటీఆర్
టాస్‌పై నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించడం పదేండ్ల కేసీఆర్ పాలనకు ఆనవాలు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నీతిఆయోగ్ ప్రశంసలు తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషికి నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలో నీతిఆయోగ్ నివేదిక గురించి ప్రస్తావిస్తూ టాస్ ద్వారా తెలంగాణ యువతకు, విద్యార్థులకు కలిగిన ప్రయోజనాలను గుర్తుచేశారు. 2014లో కేసీఆర్ మార్గదర్శనంలో ప్రారంభించిన టాస్ అనేక విజయాలు సాధించిందని పేర్కొన్నారు. పారిశ్రామిక వర్గాలు, విద్యారంగం, ప్రభుత్వాలను కలుపుతూ నాణ్యమైన మానవవనరుల తయారీకి, శిక్షణకు టాస్ ఉపయోగపడిందని వివరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం యువత కోసం నైపుణ్య రంగంలో చేసిన సేవకు దకిన గుర్తింపు అని అభివర్ణించారు. పదేండ్లలో టాస్ గొప్ప విజయాలు సాధించిందని కేటీఆర్ పేరొన్నారు. 761 కాలేజీల విద్యార్థులకు శిక్షణ ఇచ్చిందని, 9.84 లక్షల మంది విద్యార్థులకు, 18,650 మంది ఫ్యాకల్టీకి శిక్షణ అందించిందని గుర్తుచేశారు.
సుమారు 80 పారిశ్రామిక సంస్థలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుని, 35 వేల మందికి పైగా విద్యార్థులకు, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని తెలిపారు. నైపుణ్యవంతమైన తెలంగాణను ఏర్పాటు చేసే దిశగా టాస్ సంస్థ ఆవిర్భావం, దాని పనితీరు గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.టాస్క్ ద్వారా కొనసాగుతున్న సేవలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన టాస్క్ ద్వారా ఇప్పటికీ విద్యార్థులు ఆయా రంగాల్లో శిక్షణ పొందుతున్నారు. ఆంగ్లభాష, సాఫ్ట్ స్కిల్స్‌లో ప్రావీణ్యం, సోషల్ మీడియా, మొబైల్, అనలిటిక్స్, క్లౌడ్ వంటి సరికొత్త సాంకేతికతల్లో శిక్షణతో పాటు సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్థులకు ఐటీ, మౌలికాంశాలపై అవగాహనతో పాటు ఆయా అంశాల్ల్లో శిక్షణ ఇస్తున్నారు. ప్రొగ్రామింగ్‌లో సహజ సామర్థ్య పరీక్షలు, మూల్యాంకన పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ-శిక్షణ వనరులను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సహకారంతో సాంకేతికాక్భివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. కృత్రిమ(వర్చువల్) ప్రయోగశాలల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించి వారి సామర్థ్యాలను పెంచుతున్నారు. కోడింగ్, నూతన టెక్నాలజీ ఆవిష్కరణలు, కెరీర్ కౌన్సిలింగ్‌పై మార్గదర్శనం చేయడంతో విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు పొందుతున్నారు.
‘టాస్క్’ సక్సెస్