సీపీఎం జాతీయ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంతాపం ప్రకటించారు. నిజాయితీగా, ప్రజాహితం కోసం పనిచేసి, ఆదర్శ నేతగా నిలిచిన అచ్యుతానందన్.. రాజకీయ జీవితాన్ని ఎంతో స్ఫూర్తివంతంగా గడిపారని అన్నారు.
మూడుసార్లు ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ప్రజలకు అందించిన ఆయన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని కేటీఆర్ కొనియాడారు. సీపీఎం వ్యవస్థాపక సభ్యుడిగా ప్రజల పక్షాన పోరాడిన ఆయన జీవితం, అనేక తరాలకు ప్రేరణగా నిలుస్తుందని అన్నారు. అచ్యుతానందన్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
కమ్యూనిస్ట్ కురువృద్ధిగా పేరొందిన ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. సీపీఐ (ఎం) వెటరన్ నాయకుడైన అచ్చుతానందన్ గుండె సంబంధిత సమస్యలతో101 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచి వెశారు. జూన్ 23న గుండె నొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మరణించారు.