KTR | రాజన్న సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షా స్వాములకు ఏర్పాటు చేసిన భిక్ష కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన హనుమాన్ పూజలో కేటీఆర్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేటీఆర్‌కు అర్చకులు వేదాశ్వీరచనాలు అందించారు.
అనంతరం హనుమాన్ దీక్షా స్వాములను కేటీఆర్ ఆప్యాయంగా పలుకరించారు. స్వాములతో కలిసి కేటీఆర్ భోజనం చేశారు. కేటీఆర్‌తో స్వాములు ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపారు. కేటీఆర్ వెంట సిరిసిల్ల జిల్లా నాయకులు ఉన్నారు. మరికాసేపట్లో కేటీఆర్ గంభీరావుపేటలో పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం 5 గంటలకు కోనరావుపేట మండలం మల్కపేటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో నిర్వహించిన హనుమాన్ పూజ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/5mgyUIrl7P
— BRS Party (@BRSparty) April 9, 2025