ధర్మపురి/ పెగడపల్లి/ గొల్లపల్లి, ఏప్రిల్ 17 : జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించే కేసీఆర్ బహిరంగసభ చరిత్రలో నిలిచిపోయేలా విజయవంతం చేయడానికి బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని కేసీఆర్ సభ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని పెగడపల్లి, గొల్లపల్లి, బుగ్గారం మండలకేంద్రాల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను గద్దె దించడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి బీఆర్ఎస్లోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, మంత్రులపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయని విమర్శించారు. ధర్మపురి నియోజకవర్గం నుంచి 15 వేల మంది తరలివస్తారని పేర్కొన్నారు.