హైదరాబాద్: నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం మదర్ డెయిరీ (Mother Dairy) ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఘన విజయం సాధించింది. మదర్ డెయిరీలో ఖాళీ అయిన 3 డైరెక్టర్ స్థానాలకు హయత్‌నగర్‌లోని ఎస్వీ కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించారు. ఇందులో మూడింటికి మూడు బీఆర్ఎస్ అభ్యర్థులు జయకేతం ఎగురవేశారు. రచ్చ లక్ష్మినర్సింహా రెడ్డి (154 ఓట్లు), సందిల భాస్కర్ గౌడ్ (240 ఓట్లు), కర్నాటి జయశ్రీ (176) ఓట్లతో విజయం సాధించారు. అనూహ్య ఫలితాలతో కాంగ్రెస్ చైర్మన్లు కంగుతిన్నారు. ఆలేరు ఎమ్మెల్యే అయిలయ్య, డీసీసీ అధ్యక్షులు సంజీవరెడ్డి, మదర్ డైరీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.