హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో (Jubilee Hills By-Election) మైనార్టీలు కారు పార్టీకే (BRS) జై కొడుతున్నారు. నియోజకవర్గంలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీదే గెలుపని ఘంటాపథంగా చెప్తున్నారు. బీఆర్ఎస్ గెలుస్తుందని 50.5 శాతం మంది మైనార్టీలు చెప్పగా, కేవలం 27.9 శాతం మంది కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు. 22 నెలల కాంగ్రెస్ పాలనపై మైనార్టీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పాలన చాలా దారుణంగా ఉన్నదని 32.8 శాతం మంది పెదవి విరిచారు. ‘బిలియన్ కనెక్ట్’ అనే సంస్థ ప్రత్యేకంగా మైనార్టీలతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బిలియన్ కనెక్ట్ అనే సంస్థ మైనార్టీల అభిప్రాయాలపై ప్రత్యేక సర్వే నిర్వహించింది. 82 మంది సభ్యుల బృందం అక్టోబర్ 10వ తేదీ నుంచి 21 వరకు మొత్తం 12 రోజులపాటు సర్వే చేసింది. 41 పోలింగ్ స్టేషన్ల పరిధిలో 6,865 మంది మైనార్టీల నుంచి సర్వేయర్లు అభిప్రాయాలు సేకరించారు. రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఐటీ ఉద్యోగులు, గృహిణులు, రిటైర్ట్ ఉద్యోగులు, నిరుద్యోగులు, దినసరి కూలీలు ఇలా అన్ని వర్గాల వారి అభిప్రాయాలను సేకరించారు. వారంతా మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే జూబ్లీహిల్స్లో విజయం సాధిస్తుందని ధీమాగా చెప్పారు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలి
రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఎవరు కావాలని అడిగితే, కేసీఆర్ కావాలని 53.0 శాతం మంది స్పష్టంచేశారు. కేవలం 20.6 శాతం మంది మాత్రం రేవంత్రెడ్డి కావాలని అన్నారు. మతసామరస్యంలో ఏ పార్టీ ఉత్తమమని అడుగ్గా, బీఆర్ఎస్కు 59.9 శాతం మంది ఆమోదం తెలిపారు. కాంగ్రెస్కు 27.2 శాతం మంది మాత్రమే ఓటేశారు. రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుసుందని మీరు భావిస్తున్నారని అడగ్గా, బీఆర్ఎస్ గెలుస్తుందని 55.1శాతం మంది చెప్పారు. కాంగ్రెస్ వస్తుందని 24.7 శాతం మంది తెలిపారు. జీహెచ్ఎంసీ పాలనలో సరైన పార్టీ ఏదని మీరు అనుకుంటున్నారని మైనార్టీల అభిప్రాయం కోరగా, బీఆర్ఎస్కు 50.9 శాతం మంది, కాంగ్రెస్కు 21.4 శాతం మంది ఆమోదం తెలిపారు. 22 నెలల పాలనలో, హామీల అమలులో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని మైనార్టీలు కుండబద్దలు కొట్టారు. తెలంగాణ అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీయే కావాలని ఎక్కువ మంది స్పష్టంచేశారు.
తెలంగాణలో మత సామరస్యాన్ని కాపాడే పార్టీ ఏది?
సీఎంగా ఎవరిని ఇష్టపడుతారు
ఓటింగ్ రోజు మీ ప్రాధాన్యత ప్రకారం ఎవరికి ఓటు వేస్తారు
తెలంగాణలో అత్యధికంగా అవినీతి మయమైన పార్టీ ఏది?
తెలంగాణ తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో ఏపార్టీ విజయం సాధిస్తుంది?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుంది?
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల నాటి హామీలను నెరవేర్చిందా?
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సంతృప్తిగా ఉన్నారా?