మేడిగడ్డ బరాజ్‌పై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని బీఆర్ఎస్ చెప్తున్న మాటే అక్షరాలా నిజమన్న సంగతి ఎల్అండ్టీ తాజా నిర్ణయంతో ప్రజలకు తెలిసింది. ఓ నీచమైన ఊహ ఆధారంగా క్రూరమైన రాజకీయ ఎజెండాతో ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో ఆ రిపోర్ట్‌ను తయారు చేసిండ్రు. -కేటీఆర్
KTR | హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు చీప్ క్వాలిటీది కాదని, తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్నవే చీప్ పాలిటిక్స్ అని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కనీస పరీక్షలు చేయకుండా, ఎలాంటి శాస్త్రీయ డాటాను సేకరించకుండానే రూపొందించిన ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదికను ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ తిరసరించడమే ఇందుకు సాక్ష్యమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను బద్నాం చేయడానికే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్డీఎస్ఏ ఓ అశాస్త్రీయ నివేదిక ఇచ్చిందన్న నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరలేపాయని మండిపడ్డారు. తప్పుల తడక నివేదికతో కాళేశ్వరంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని బుధవారం ఓ ప్రకటనలో విమర్శించారు.
ఎన్డీఎఎస్ నివేదిక బూటకం
మేడిగడ్డ బరాజ్‌పై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని బీఆర్ఎస్ చెప్తున్న మాటే అక్షరాలా నిజమన్న సంగతి ఎల్అండ్టీ నిర్ణయంతో ప్రజలకు తెలిసిందని కేటీఆర్ పేర్కొన్నారు. క్రూరమైన రాజకీయ ఎజెండాతో ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ కేంద్ర కార్యాలయాల్లో ఆ రిపోర్ట్‌ను తయారుచేశారని ఆరోపించారు. ఎన్డీఎస్ఏ నివేదికను ఎన్డీఏ నివేదిక అని పిలవడంలో తప్పులేదని పేర్కొన్నారు. పనికిరాని రిపోర్టును ప్రామాణికమని రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని మండిపడ్డారు. కేసీఆర్‌కు పేరొస్తుందని కాళేశ్వరాన్ని పకనపెట్టి రేవంత్ క్షమించరాని పాపం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయలే
క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను ఎల్అండ్టీ తిరసరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సరారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కేటీఆర్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో 18 నెలలుగా ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణం వరకు నాణ్యతలో ఎకడా రాజీ పడకుండా కట్టిన కాళేశ్వరంపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్అండ్టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిన నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాం డ్ చేశారు. ఇకనైనా పోలవరం తరహాలో మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని సూచించారు. లేకుంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్-బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఎవరు ఎన్ని కుట్ర సిద్ధాంతాలను సృష్టించినా వాస్తవం మాత్రం చెకు చెదరకుండా ఉంటుందని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి అని, రాష్ర్టానికి కేసీఆర్ దార్శనికుడని కేటీఆర్ స్పష్టంచేశారు.
కేసీఆర్‌కు పేరొస్తుందనే రాజకీయ దుగ్ధతోనే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని పకనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేసిండు. ముఖ్యమంత్రి నిర్వాకంతో ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి, 500 మందికిపైగా అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్నరు. -కేటీఆర్