సచ్చేదాకా బీఆర్ఎస్ జెండా మోస్త!
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యుడు సమ్మ రాజు మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించిన ఆ పార్టీ నాయకులకు ‘సచ్చేదాకా బీఆర్ఎస్ జెండా మోస్త.. నా పార్టీని వదిలే ప్రసక్తే లేదు’ అంటూ స్పష్టంచేశారు.
- భూపాలపల్లి జిల్లా అన్నారం బీఆర్ఎస్ కార్యకర్త ఆడియో వైరల్
- ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
మహదేవపూర్, జూన్ 30 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వార్డు సభ్యుడు సమ్మ రాజు మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాంగ్రెస్లోకి రావాలని ఆహ్వానించిన ఆ పార్టీ నాయకులకు ‘సచ్చేదాకా బీఆర్ఎస్ జెండా మోస్త.. నా పార్టీని వదిలే ప్రసక్తే లేదు’ అంటూ స్పష్టంచేశారు. ఈ ఆడియోను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఈ పోస్ట్కు విశేష స్పందన లభించగా, సామాజిక మాధ్యమాల్లో ఆడియో వేగంగా వైరల్ అవుతున్నది. అన్నారం గ్రామానికి చెందిన ఆ కార్యకర్త పార్టీపై తన విధేయతను, ఆత్మాభిమానాన్ని వ్యక్తంచేసిన తీరు బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. అధికారం కోసం పార్టీ మారడం కంటే సిద్ధాంతాలు, నమ్మకాలకు కట్టుబడి ఉండటమే ముఖ్యమనే సందేశాన్ని ఆయన మాటల్లో ప్రతిబింబిస్తున్నట్టు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పేరొంటున్నారు.
సంభాషణ జరిగిందిలా..
కాంగ్రెస్ నాయకుడు : పార్టీల కలుత్తాండ్రు వీళ్లంతా..
బీఆర్ఎస్ వార్డు సభ్యుడు : ఎవరెవరు?
కాంగ్రెస్ నాయకుడు : ఉపసర్పంచ్, వీళ్లంతా.. గవర్నమెంట్ ఉన్నది కాబట్టి పావలా పరకో సంపాదించుకోవచ్చు.. మళ్లా నువ్వు పెద్ద లీడర్ అయితవ్
బీఆర్ఎస్ వార్డు సభ్యుడు : కరెక్టే కానీ, నేను రాలేను బావా! నేను సచ్చినా కూడా రాలేను.. రాను.. రాను..
కాంగ్రెస్ నాయకుడు : కారణమేంటోయ్?
బీఆర్ఎస్ వార్డు సభ్యుడు : కారణం ఏమీ లేదు.. నేను రాలేను.. అంతే
కాంగ్రెస్ నాయకుడు : మనోనికి ఇల్లు వస్తది కదా..
బీఆర్ఎస్ వార్డు సభ్యుడు : మనోనికి ఇల్లు వచ్చినా, రాకపోయినా వద్దు.. అంతే సచ్చేదాక నేను ఇదే బీఆర్ఎస్ జెండానే మోస్త.. రాలేను నేను
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

