BRS | రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఊరువాడా ఎల్కతుర్తికి బయల్దేరాయి. ఇంటి పార్టీ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న 25 ఏండ్ల పండుగకు దండులా కదిలాయి. వాహనమేదైనా దారి మాత్రం ఎల్కతుర్తి వైపే అన్నట్టుగా పయనమయ్యాయి. గులాబీ జెండా పట్టి, కండువా చుట్టి ప్రత్యేక వాహనాల్లో తరలాయి. సర్కారు పెట్టిన ఆంక్షలన్నీ దాటుకొని సభా ప్రాంగణానికి చేరుకున్నాయి. దారంతా జైతెలంగాణ.. జైజై కేసీఆర్.. నినాదాలతో శ్రేణులు హోరెత్తించాయి. సభకు రాని వారు టీవీలకు అతుక్కుపోగా, ప్రజానీకమంతా తమ అభిమాన నేత కేసీఆర్ ప్రసంగాన్ని వినేందుకు ఆసక్తి చూపించారు. సభ సక్సెస్ కావడంతో పార్టీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తంచేశాయి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కు చెందిన ఓ యువకుడు ఉద్యమనేత కేసీఆర్‌పై ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నాడు. కేసీఆర్ అంటే తనకెంతో ఇష్టమని అందుకే ఆయన పేరును ఇలా సెట్ చేయించుకొని రజతోత్సవ సభకు బయలుదేరినట్టు చెప్పాడు.
కరీంనగర్ నుంచి రజతోత్సవ సభకు వెళ్లే బస్సుపైకెక్కి అభివాదం చేస్తున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నాయకులు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి పెద్ద ఎత్తున వెళ్తున్న ప్రైవేట్ వాహనాలు
ఎల్కతుర్తి సభ అనంతరం తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా చేర్యాల వద్ద కేసీఆర్‌కు జననీరాజనం
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్ససభకు బయల్దేరిన నల్లగొండ నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి దారి మధ్యలో భోజనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి
హైదరాబాద్ నుంచి ఎల్కతుర్తిలోని బీఆర్ఎస్ రజతోత్సవ సభాస్థలికి వెళ్తున్న త్రిచక్రవాహనంపై వెళ్తున్న దివ్యాంగుల సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మదార్ పాషా
కామారెడ్డిలో ఓ సెలూన్లో మొబైల్లో కేసీఆర్ ప్రసంగాన్ని వింటున్న యువకులు
హనుమకొండ జిల్లా మడికొండ శివారులో ఢీకొన్న రెండు బస్సులు
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో ప్రైవేట్ బస్సులను ఆపుతున్న డీటీవో వెంకటరమణతో వాగ్వాదానికి దిగిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య
నల్లగొండ జిల్లా నుంచి ఎల్కతుర్తి సభకు జై తెలంగాణ, జైజై బీఆర్ఎస్ నినాదాలు చేస్తూ బయల్దేరిన బీఆర్ఎస్ నాయకులు
బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్పల్లి గ్రామంలో రాయించిన గోడరాతలను తొలగించిన కాంగ్రెస్ నాయకులు
నిజామాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తికరంగా వీక్షిస్తున్న యువకులు
బోథ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో ర్యాలీగా బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిజామాబాద్‌లో టీవీలో ఆసక్తికరంగా వీక్షిస్తున్న కుటుంబం
కరీంనగర్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులో ర్యాలీగా బయల్దేరి జైతెలంగాణ నినాదాలు చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు