దేశం అబ్బురపడే విజయాలు
తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే సాధించిన విజయాలను చూసి దేశం అబ్బురపడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు చెప్పారు.
- బీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే సాధించిన విజయాలను చూసి దేశం అబ్బురపడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు చెప్పారు. లోక్‌సభలో జరిగే చర్చల సందర్భంగా తాను తెలంగాణ సాధించిన విజయాల గురించి చెప్తుంటే.. చాలామంది ఎంపీలు ఆశ్చర్యపోయారని అన్నారు. ఇది నిజమేనా? అంటూ తనను అడిగేవారని, తెలంగాణకు వచ్చి చూడాలని తాను వారితో చెప్పానని నామా వెల్లడించారు. నెహ్రూ తర్వాత దేశం గురించి పట్టించుకున్న నేతలెవరూ లేరని, ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీ ప్రజల గురించి ఆలోచించడం లేదని అన్నారు. 25 ఏండ్లుగా నదుల అనుసంధానంపై చర్చ జరుగుతూనే ఉన్నదని, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదని చెప్పారు. గోదావరి నీటిని 600 మీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి, బీడుభూములకు నీళ్లు ఇచ్చామని, ఇది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లనే సాధ్యమైందని అన్నారు. రైతుబంధు, దళితబంధు, మిషన్ భగీరథ లాంటి అనేక అద్భుతాలను తెలంగాణ సాధించి చూపిందని వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చాలా ప్రభుత్వాలు తమ తమ రాష్ర్టాల్లో ప్రవేశపెట్టాయని, కేంద్రప్రభుత్వం కూడా ‘హర్ ఘర్ జల్’ యోజన సహా అనేక పథకాలను తెలంగాణలో చూసే కాపీ కొట్టిందని అన్నారు. గుజరాత్లో బీజేపీ రాజకీయంగా గెలిచిందే కానీ, అభివృద్ధిపరంగా చూస్తే తెలంగాణ కన్నా ఆ రాష్ట్రం వెనుకబడే ఉన్నదని తెలిపారు. ఇప్పటికీ తాగునీటి సమస్యలు వీడలేదని, సరైన విద్యుత్తు సౌకర్యంలేని పల్లెలు కనిపిస్తాయని, 24 గంటల విద్యుత్తు కూడాఅక్కడలేదన్నారు. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో కొత్తశకం ప్రారంభమైందన్నారు. ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా బీఆర్ఎస్ ఉంటుందని, జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | చెరువులో మునిగి యువకుడి మృతి.. తండ్రికి దూరమైన ముగ్గురు చిన్నారులు!
భువనగిరి అరోరా కాలేజీలో కలకలం.. విద్యార్థినుల ఫొటోలు, వీడియోలు లీక్.. వైరల్ అవుతున్న ఆడియో కాల్!
Donald Trump | నాకు 8 నోబెల్ శాంతి బహుమతులు రావాల్సింది.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి..!
Earthquake | పనామాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.6 తీవ్రత నమోదు..!
Nara Lokesh | ‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేష్ ప్రశంసలు.. విజయ్ దేవరకొండ నటనకు ఫిదా!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

