మారేడ్‌పల్లి, జూలై 25 : పోలీసులు పెట్టే అక్రమ కేసులకు, చేసే అరెస్టులకు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, కార్యకర్తలకు పార్టీ నాయకత్వం, న్యాయ విభాగం అండగా ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభయమిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి బంధువులు చేస్తున్న కుంభకోణాలపై ఇటీవల ‘ఏ టు జెడ్’ పేరుతో జూబ్లీ బస్‌స్టాండ్ సమీపంలో హోర్డింగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి కంటోన్మెంట్ యువకులు సాయికిరణ్, కల్యాణ్ సం దీప్, రఘును పోలీసులు అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ క్రిషాంక్ న్యాయవాద బృందంతో కలిసి మారేడ్‌పల్లి పోలీస్‌స్టేషన్ వెళ్లి వారిని బెయిల్‌పై విడుదల చేయించారు. సాయి కిరణ్, కల్యాణ్ సందీప్, రఘు శుక్రవారం కేటీఆర్‌ను కలిశారు. వారికి కేటీఆర్ భయపడొద్దని ధైర్యం చెప్పారు.