గజ్వేల్, డిసెంబర్ 17 : నిన్నటివరకు భర్త సర్పంచ్‌గా ఉన్నాడు. బుధవారం జరిగిన ఎన్నికల్లో ఆయన భార్యను సర్పంచ్‌గా గెలిపించుకున్నాడు. సిద్దిపేట జిల్లా మాత్పల్లి సర్పంచ్‌గా బీఆర్ఎస్ మద్దతుదారు బచ్చలి శ్రీలతామహిపాల్ సర్పంచ్‌గా గెలుపొందింది. ఇప్పటివరకు ఆమె భర్త మహిపాల్ సర్పంచ్‌గా ఉండగా, ప్రస్తుత ఎన్నికల్లో భార్య శ్రీలతను పోటీలో పెట్టగా కాంగ్రెస్ అభ్యర్థిపై 150 ఓట్లతో గెలుపొందింది.
మహబూబ్‌నగర్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం ఏటిగడ్డ శాఖాపురం సర్పంచుగా ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న కేఎన్ నిఖిత గెలుపొందారు. 500కు పైగా ఓట్ల మెజారిటీతో సమీప ప్రత్యర్థి లచ్చమ్మపై విజయం సాధించింది. ఆమె నాగర్‌కర్నూల్ మెడికల్ కాలేజీలో చదువుతున్నది.