నమస్తే తెలంగాణ న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 5: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు సంబురం గా సాగుతున్నాయి. కార్యకర్తలు కుటుంబ సభ్యులతో పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్చార్జీలు, నేతలు హాజరై కార్యకర్తలను ఆత్మీయంగా పలుకరిస్తున్నారు. వారి సాధకబాధ కాలు తెలుసుకొంటున్నారు. అండగా ఉం టామని భరోసా ఇస్తున్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మేళనాలు జరిగాయి.
జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామన్న గూడెం, రామవరంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడు తూ.. అభివృద్ధిలో తెలంగాణ గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో కేంద్ర ఫైనాన్స్ నిధులకు సమానంగా రాష్ట్ర నిధులు కేటాయిస్తుండటం తో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెం దుతున్నట్టు తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మేళనానికి ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. లింగాల మండలం మగ్దూంపూర్ చౌరస్తాలోని శ్రీనివాస పద్మావతి ఫంక్షన్హాల్లో జరిగిన సమావేశానికి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జో గుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం షాబాదా, ధరూర్ మండల కేంద్రంలో జరిగిన సమ్మేళనాలకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యేలు అబ్రహాం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నాథం హాజరయ్యారు.
అంతకుముందు శ్రేణులతో కలిసి నాయకులు ర్యాలీ నిర్వహించారు.ప్రభుత్వ పథకాలు, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని ఐలాబాద్-చల్లూరు స్వర్ణలత ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ పాల్గొన్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండల స్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ఎంపీ పసునూరి దయాకర్ పాల్గొన్నారు. నిజామాబాద్ బా ల్కొండ నియోకవర్గంలోని ఏర్గట్లలో రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ నగరంలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్లోఎమ్మెల్యే హన్మంత్ షిండే పాల్గొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లిలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. కురవి ఎంపీపీ గుగులోత్ పద్మావతీ-రవినాయక్ దంపతులు పేదరికంతో ఇబ్బంది పడుతున్నారని సోషల్‌మీడియాలో వైరల్ అవుతుండటంతో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్ రూ.లక్ష చొప్పున వేదికపై అందజేశారు. అధైర్యపడొద్దని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వద్దకు తీసుకువెళ్తా మని హామీ ఇచ్చారు. జిల్లా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ రూ.50 వేల ఆర్థికసాయాన్ని ప్రకటించారు. కష్టాల్లో ఉన్న ఎంపీపీ కుటుంబానికి అండగా ఉంటామని పలువురు తెలిపారు.