Teacher | విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పి ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ఓ టీచర్ ఆ విషయాన్ని మరిచిపోయాడు. ఓ ఫిజిక్స్ టీచర్ తను చదువు చెబుతున్న స్కూల్లో పదో తరగతి విద్యార్థినిని ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్- మల్కాజ్ గిరి జిల్లా పోచారం డివిజన్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో వెలుగుచూసింది.
పాఠశాలలో పనిచేస్తున్న పర్రే మైటిన్ (27)అనే ఫిజిక్స్ టీచర్ ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి సదరు విద్యార్థినిని పెళ్లి చేసుకున్నాడు. విద్యార్థిని మెడలో పసుపు తాడు చూసిన తల్లి ఆమెను ప్రశ్నించడంతో విద్యార్థిని జరిగిన విషయాన్ని చెప్పింది. దీంతో బాలిక కుటుంబసభ్యులు పాఠశాల యాజమాన్యాన్ని నిలదీశారు.
ఈ వ్యవహారంపై పాఠశాల మేనేజ్మెంట్ నుంచి నిర్లక్ష్యంగా సమాధానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఫర్రే మైటీన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు.
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసు.. సాయం చేయడానికి ఎవరూ లేరు.. నటుడు రాజ్‌పాల్ యాదవ్ ఆవేదన
NTR | జోర్డాన్‌లో ఎన్టీఆర్ దుమ్మురేపుతున్న ‘డ్రాగన్’ యాక్షన్… ప్రశాంత్ నీల్ భారీ ప్లాన్!
Epstein files | ఎప్స్టీన్తో విందులో ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్.. ఫొటోలు విడుదల