హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తే తెలంగాణ) : లగచర్ల ఉదంతం వెలుగుచూసినప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఆ తండావాసులకు తోడునీడగా కొనసాగుతున్నది. ఫార్మా కంపెనీ కోసం భూములు ఇవ్వని గిరిజనుల పట్ల రేవంత్రెడ్డి సర్కార్ సృష్టించిన భయానక వాతావరణం దేశం దృష్టిని ఆకర్షించేలా బీఆర్ఎస్ చేయగలిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సీఎం తన సొంత నియోజకవర్గ ప్రజల మనసులు గెలుచుకోలేకపోతున్నారనే విషయాన్ని బీఆర్ఎస్ ఆధారాలతో నిరూపించగలిగిందని జాతీయ మీడియా కథనాలే స్పష్టంగా చెప్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘దేశంలో అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రభుత్వ ప్రేరేపిత దాష్టీకాలు జరుగుతాయి. బీఆర్ఎస్లాగా బాధితుల పక్షాన ఇంత బాధ్యతగా ఒక అంశాన్ని నెత్తికెత్తుకున్న ఉదంతాలు ఇటీవలి కాలంలో తాము చూడలేదు’ అని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ వ్యవహారాలను దగ్గరి నుంచి పరిశీలించే ఒక సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. ఫార్మా కంపెనీల కోసం తన సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి సాగిస్తున్న దురాగతాన్ని బీఆర్ఎస్ పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎండగడుతున్నది. పథకం ప్రకారం కరెంటు తీసి, అర్ధరాత్రి ఇండ్లలోకి చొరబడి, ఆడబిడ్డలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసుల దురాగతాన్ని బీఆర్ఎస్ లోకానికి చాటిచెప్తున్నది. కొడంగల్లో జరిగిన అరాచకాలను, ఆగడాలను వెలికితీయాలని కన్నీటి పర్యంతమైన నేపథ్యాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం ఢిల్లీలో బట్టబయలు చేసింది. లగచర్ల దారుణాలను జాతీయ మానవహక్కుల కమిషన్, మహిళా కమిషన్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.
లగచర్ల బాధితులకు అండగా నిలిచి జాతీ య స్థాయిలో వారికి బాసటగా నిలవడంలో బీఆర్ఎస్ అనుసరించిన కార్యాచారణపై పలువురు హర్షం వ్యక్తంచేస్తున్నారు. లంబాడా హ కుల పోరాట సమితి, ఎస్టీ సంఘాల ఐక్యవేదిక, భారత్ ముక్తి మోర్చా, ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్లు సహా పలు ప్రజాసంఘాల మద్దతును కూడగట్టడంలో బీఆర్ఎస్ కార్యాచరణ తోడ్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో ఫార్మా వి లేజ్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం నుంచి ఇ ప్పటివరకు నెలకొన్న పరిస్థితులపై దర్యాప్తు సం స్థలు ఆరా తీస్తున్నాయి. మరోవైపు వికారాబాద్ జిల్లా యంత్రాగం నుంచి కానిస్టేబుళ్ల వ రకు అసలేం జరిగిందో కూపీలాగుతున్నాయి.