నస్రుల్లాబాద్, జూలై 12 : తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జుబేర్ హెచ్చరించారు. కాళేశ్వరం నుంచి నిజాంసాగర్‌కు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.