బేగంపేట్, హైదరాబాద్ : ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ(Development and welfare) కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈనెల 20 నుంచి బీఆర్ఎస్(BRS) ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్(Minister Talasani) వెల్లడించారు. మంగళవారం సనత్‌నగర్ నియోజకవర్గం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులతో మారేడ్‌పల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఈ నెల 20వ తేదీన మోండామార్కెట్, 23న రాంగోపాల్‌పేట్, 25న బేగంపేట్, 27న అమీర్‌పేట్, 29న సనత్‌నగర్, ఏప్రిల్ 2న బన్సీలాల్‌పేట్ డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలిచిందని చెప్పారు.
ఆర్థికంగా ఎంతో వెనకబడిన దళితులు అభివృద్ధి చెందాలనే సదుద్ధేశ్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) దళిత బంధు (Dalitabandu)ను చేపట్టి అర్హులైన నిరుపేద దళితులకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి వంద మందికి అందించగా 2వ విడతలో నియోజకవర్గానికి 1100 మందికి ఆర్థిక సహాయం అందించనున్నట్టు వెల్లడించారు.
ఆదేవిధంగా సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారికి గృహలక్ష్మీ క్రింద రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే విధంగా ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించినట్టు వివరించారు. దీనికి సంబంధించిన మార్గ దర్శకాలు రానున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ ఇన్చార్జి సాయికిరణ్‌యాదవ్, కార్పొరేటర్లు మహేశ్వరి, కొలన్ లక్ష్మీబాల్‌రెడ్డి, హేమలతా, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.