హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలోని తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని అవమానించినందుకు ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ చేనేత ఎక్స్పో కోసం అమరుల స్థూపానికి ఫ్లడ్ లైట్లు కట్టి సిబ్బంది అమరవీరుల స్థూపాన్ని అవమానించడం గర్హనీయమని పేర్కొన్నారు.