హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు కొందరు మంత్రులు విదేశా ల్లో ఉండగా.. ఇంకొందరు కర్ణాటకలో మకాం వేశారని బీఆర్ఎస్ సోషల్ మీడి యా కన్వీనర్ సతీశ్‌రెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఒక్క మంత్రి అందుబాటులో లేరని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. పాలనన గాలికొదిలి గాలిమోటర్లలో సీఎం, మంత్రులు చక్కర్లు కొడుతున్నారని, పోలీసుల పహారాలో గ్రామసభలు జరుగుతుంటే వారు పర్యటనలో ఉన్నారని, వారి వివరాలను ట్వీట్‌కు జతచేశారు.