మేడ్చల్, ఏప్రిల్ 17(నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా జవహర్నగర్ కార్పొరేషన్ పరిధిలో మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ ఆహ్వాన పత్రికలను అందజేశారు. బీఆర్ఎస్ మహిళా శ్రేణులు మహిళలకు బొట్టుపెడుతూ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రజతోత్సవ సభకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గోడలపై కేసీఆర్ నాయకత్వం వర్థిల్లాలి, రజతోత్సవ సభ విజయవంతం కావాలి అంటూ మల్లారెడ్డి వాల్ పెయింటింగ్ వేశారు.