హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డిని పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న నాగం జనార్దన్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కేటీఆర్ వెంట ఎమ్మెల్సీలు తక్కళ్లపల్లి రవీందర్రావు, నవీన్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, మాజీమంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి, బాల్క సుమన్, కోరుకంటి చందర్, గణేశ్‌గుప్తా తదితరులు ఉన్నారు.