Vote Chori | తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ఓటు చోరీ బాగోతం బయటపడింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఏకంగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఓటునే తొలగించారు. హైకోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నప్పటికీ అధికారులు ఆయన ఓటును నమోదు చేయకపోవడం గమనార్హం.
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలం రామకృష్ణాపురం గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కురుగుంట్ల రవీందర్ రెడ్డి ఓటును తొలగించారు. గత ఎన్నికల్లో రామకృష్ణాపురం గ్రామంలో భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమలరాజుకు ఆధిక్యం రావడంతో కక్ష సాధింపు చర్యగా ఈ ఓటును తొలగించినట్లు తెలుస్తోంది. హైకోర్టు ప్రొసీడింగ్స్ ఉన్నా కూడా భట్టి విక్రమార్క ఆదేశాలతో అధికారులు ఓటు నమోదు చేయలేదని సమాచారం.