BRS | మరికాసేపట్లో బీఆర్ఎస్ ప్రతినిధుల సభ.. తెలంగాణభవన్‌కు చేరుకుంటున్న పార్టీ శ్రేణులు
బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణభవన్‌లో (Telangana bhavan) జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇలా మొత్తం 279 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభంకానుంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన తెలంగాణభవన్‌లో (Telangana bhavan) జరుగనున్న ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, జడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఇలా మొత్తం 279 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యే పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం పలు అంశాలపై పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఆవిర్భావ సందేశం.. దిశానిర్దేశం
22 ఏండ్ల కింద జలదృశ్యం వేదికగా పురుడుపోసుకున్న టీఆర్ఎస్ గత సంవత్సరం విజయదశమినాడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందింది. 14 ఏండ్ల స్వరాష్ట్ర ఉద్యమ ప్రస్థా నం, ఎనిమిదిన్నరేండ్లుగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అప్రతిహత కొనసాగింపు, అనతికాలంలోనే తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిన నేపథ్యంతోపాటు భవిష్యత్ కార్యాచరణపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నా రు. బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత దేశవ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో పార్టీకి వ స్తున్న ఆదరణ, అనంతర కార్యాచరణ వంటి అంశాలను శ్రేణులకు వివరించనున్నారు. బీజే పీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు బీఆర్ఎస్పై కావాలని బురదజల్లే కుట్రలు ఎలా చేస్తున్నారు? వాటిని ఎలా తిప్పికొట్టాలి? క్షేత్రస్థాయిలో ప్రజలతో పార్టీ శ్రేణులు ఎలా మసలుకోవాలి? వంటి అంశాలపై అధినేత, సీఎం కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు.
కీలక తీర్మానాలు
బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత జరగుతున్న మొదటి ప్రతినిధుల సభ కా వటంతో నేటి సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ నేపథ్యంలో కీలక రాజకీయ తీర్మానాలు, పార్టీ పరిపాలనా తీర్మానాలు ఉం డే అవకాశాలున్నాయి. దళితబంధు పథకం, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ నేపథ్యంలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపే తీర్మానం ఉండొచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్నికల సన్నద్ధత.. రూట్‌మ్యాప్
ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో నేడు జరిగే ప్రతినిధుల సమావేశం కీలకం కానున్నది. ఈనెల 30న బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయ ప్రారంభోత్సవం, జూన్1న అమరవీరుల స్మృతి చిహ్నం నిర్మాణ ప్రాముఖ్యతను విస్తృతంగా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి? అనే అంశంపై సీఎం కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

