నారాయణపేట, ఏప్రిల్ 9 : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జిల్లా నుంచి ప్రజలు భారీ గా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో రజతోత్సవ సభ వాల్పోస్టర్ను విడుదల చేశారు. సభకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సూచించారు.