కర్ణాటక కుట్రలతో పాలమూరు ఎడారే
ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు.
- ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచితే జూరాలకు చుకనీరు రాదు
- కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఎలా ఆపాలో మాకు తెలుసు
- ఆర్డీఎస్ నుంచి పాదయాత్ర చేస్తాం.. లేదంటే బద్దలు కొడ్తం
- కాంగ్రెస్ సర్కార్‌కు మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరిక
- ప్రమాదంలో పాలమూరు: మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
హైదరాబాద్, జూన్ 23(నమస్తే తె లంగాణ): ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు. కర్ణాటక ప్రభు త్వం ఇప్పటికే ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే పనులను ప్రారంభించిందని, జూరాలకు నీళ్లు రావడం లేదని విమర్శించారు. ఆల్మ ట్టి ఎత్తు పెంచితే జూన్, జూలై నెలల్లో సైతం కృష్ణా నదికి నీరు వచ్చే పరిస్థితి ఉం డదని, ఫలితంగా పాలమూరు జిల్లా శాశ్వతంగా ఎడారిగా మారుతుందని ఆందోళ న వ్యక్తంచేశారు. అటు రాజోలిబండకు ఇరువైపులా బరాజ్‌లు నిర్మించేందుకు కర్ణాటక సిద్ధమైందని, ఇదే జరిగితే ఆర్డీఎస్కు చుకనీరు రాదని పేర్కొన్నారు. కర్ణాటక అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఎలా ఆపాలో తమకు తెలుసని, అవసరమైతే వాటిని బద్దలు కొడుతామని హెచ్చరించారు. ఈ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా మరోసారి ఆర్డీఎస్ నుంచి పాదయాత్ర చేస్తామని, దీనికి పాలమూరు ప్ర జలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చా రు.
తెలంగాణభవన్‌లో మంగళవారం ఆ యన మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు పేదరికాన్ని ప్రపంచబ్యాంకుకు చూపించి తెచ్చిన అప్పులను ఆంధ్రా ప్రాంతానికి కేటాయించారని, పాలమూరును దత్తత తీసుకున్నా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని శ్రీనివాస్‌గౌడ్ గుర్తుచేశారు. నాడు బాంబులు వేస్తామని భయపెట్టి రాయలసీమకు నీళ్లు తరలించుకుపోయారని దుయ్యబట్టారు. ఒకప్పుడు తుంగభద్ర నుంచి ఆర్డీఎస్ ద్వారా 90 వేల ఎకరాలకు సాగునీరు అందేదని, కానీ ప్రస్తుతం 30 వేల ఎకరాలకు కూడా నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. నాడు కేసీఆర్ ఆర్డీఎస్ నుంచే తన పాదయాత్ర ప్రారంభించారని, అనంత రం ముఖ్యమంత్రి అయ్యాక తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లిచ్చే ప్రయత్నం చేశారని చెప్పారు. అయితే, కేఈఆర్ఎంబీ అనుమతులు లేకుండానే కర్ణాటక ప్రభు త్వం ఆర్డీఎస్‌పై రిజర్వాయర్లు, కృష్ణా నదిపై మరో మూడు బరాజ్‌లు ప్లాన్ చేస్తున్నదని మండిపడ్డారు.
పాలమూరు ప్రజలకు రేవంత్ ద్రోహం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాజకీయ జీవితం ప్రసాదించిన పాలమూరు ప్రజ లు, రైతుల ప్రయోజనాలు కాపాడకపోతే ఆయనకు వారి ఉసురు తగులుతుందని మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ హెచ్చరించారు. పాలమూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ, ఆ జిల్లా వల్లనే రాజకీ య జన్మఎత్తిన సీఎం రేవంత్‌రెడ్డి.. ప్ర స్తుతం కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏకంగా ఎన్వోసీ ఇచ్చి పాలమూరు ప్రజలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులే ఈ బరాజ్‌లకు కాంట్రాక్టర్లుగా మారి, పాలమూరును శాశ్వతంగా కరవు జిల్లాగా మార్చే కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా, సీఎం రేవంత్‌రెడ్డి కూడా అకడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నా జిల్లా ప్రయోజనాలను కాపాడటంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇప్పటికైనా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మిగిలి ఉన్న 10% పనులను తక్షణమే పూర్తి చేసి జిల్లాను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
Veeramani Sweet Box | స్వీట్ బాక్స్ అడిగితే రూ. 70 కోట్ల మిలిటరీ ట్యాంక్ ఆర్డర్.. వేధింపులు తాళలేక ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
Saluru | చైర్పర్సన్ పదవిపై ఆశ.. ఆగమేఘాల మీద ప్రేమ పెళ్లి! సాలూరులో టీడీపీ నేత ‘పొలిటికల్ మ్యారేజ్’ వైరల్!
Ekta Kapoor | గుడి నుంచి క్లబ్‌కు వెళ్తే షాకయ్యారు.. ఇండస్ట్రీలో హిందూ వ్యతిరేకతపై ఏక్తా కపూర్ కామెంట్స్!
Shikhar Dhawan: పర్మిషన్ లేకుండానే టోర్నీలో పేరు.. నిర్వాహకులపై శిఖర్ ధావన్ చట్టపరమైన చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

