Indravelli | కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఇంద్రవెల్లిలో బీఆర్ఎస్ నిరసన
కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు.
ఇంద్రవెల్లి : కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతుల పంట పొలాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో నిరంతరం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విమర్శించారు. వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం, నీటిపారుదల సమస్యలు, విద్యుత్ సమస్యలు, యూరియా కొరత, రైతు బీమా తదితర సమస్యలపై రైతు సదస్సులు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ఆరు గ్యారంటీల పేరుతో నిలువునా మోసం చేశారని విమర్శించారు. యూరియా యాప్ తో రైతుల కష్టాలు రెట్టింపయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ ఎస్ తరఫున ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మారుతిపటేల్ డోంగ్రే, నాయకులు జిలానీ బేగ్, సుఫియాన్, అముల్, గైను, ధరణి ధన్ రాజ్, శైలేందర్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

