రైతు భరోసా(రైతు బంధు)ను ఎగ్గొట్టడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ సర్కారుపై అన్నదాతలు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులకు మద్దతుగా జిల్లా, మండల కేంద్రాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు చేశారు. రైతులకు ద్రోహం చేసిన రేవంత్, ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేసి.. వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు.
రేవంత్ సర్కారు హామీలను అమలు చేయకుండా అన్నదాతలను నయవంచనకు గురిచేసిందని దుయ్యబట్టారు. ఇప్పటికే రుణమాఫీ విషయంలో కర్షకులను వంచించిన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు రైతు భరోసా విషయంలోనూ మరోసారి మోసం చేసిందని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి మోసకారితనం మరోసారి బయటపడిందంటూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు.
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గడచిన వానకాలం రైతుభరోసా ఇవ్వబోమంటే తాము ఊరుకోబోమని తేల్చిచెప్పారు. సబ్ కమిటీ నివేదిక వచ్చాకే యాసంగి సాయం అందిస్తామంటే సహించబోమని తేల్చిచెప్పారు.
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నాలో మాట్లాడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్. చిత్రంలో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తదితరులు
జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు
సూర్యాపేటలో బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి నిరసన వ్యక్తంచేస్తున్న మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్
మంచిర్యాలలో ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావును అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
మహబూబాబాద్‌లో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు. చిత్రంలో మాజీ ఎమ్మెల్యే
శంకర్‌నాయక్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు
మెదక్‌లో రహదారిపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు
నారాయణపేట జిల్లా మద్దూరులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు
మేడ్చల్‌లో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నాయకులు, రైతు సంఘాల నాయకులు
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలకేంద్రంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాస్తారోకోలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు
భద్రాద్రి జిల్లా ఇల్లెందులో సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, బీఆర్ఎస్ నాయకులు
నారాయణపేట జిల్లా మక్తల్ మండలకేంద్రంలో నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
రంగారెడ్డి జిల్లా షాబాద్ ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ యువ నాయకుడు పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ పట్నం అవినాశ్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు
పెద్దపల్లిలో నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు
ఆదిలాబాద్ జిల్లా బేలలో సీఎం ఫ్లెక్సీని దహనం చేస్తున్న మాజీ మంత్రి జోగు రామన్న
ఖిలావరంగల్‌లోని పడమర కోటలో అమర వీరుల స్తూపం వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్