జయశంకర్ భూపాలపల్లి, (నమస్తే తెలంగాణ) : నకిరేకల్, సెప్టెంబర్ 10 : కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామస్తులు పేర్కొన్నారు. వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై డప్పు చప్పుళ్లతో గురువారం నిరసన తెలిపారు. స్పీకర్‌ను శాసనసభలో పదేపదే దళితుడని పేర్కొంటూ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అవమానిస్తున్నారని.. ఎన్నికల హామీలు నెరవేర్చని దళిత ద్రోహి రేవంత్‌రెడ్డి వెంటనే గద్దె దిగాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. నకిరేకల్‌లో రెండు గంటల పాటు డప్పు కొట్టి, దళిత బంధువు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చిరుమర్తి మాట్లాడుతూ..
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టింది, సచివాలయం వద్ద 120 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలం ఎస్ఎం కొత్తపల్లిలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు రోడ్డు పనులకు శిలాఫలకం వేసి ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు పిండ ప్రదానం చేసి, ఏడాది మాసికం నిర్వహించి, శిలాఫలకాల వద్ద చావుడప్పులు మోగించారు.. కాంగ్రెస్ పాలన చూసి శిలాఫలకాలు నవ్వుకుంటున్నాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఎద్దేవాచేశారు. ఎస్ఎం కొత్తపల్లిలో అంతర్గత రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు శిలాఫలకం వేసి ఏడాది గడిచినా పనులు ప్రారంభించకపోవడమేమిటని ప్రశ్నించారు.