పాలకుర్తి, జూన్ 1: జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నిర్మించిన తెలంగాణ తల్లి గద్దె విషయంలో కాంగ్రెస్ దౌర్జన్యానికి దిగింది. పోలీసుల అండ తో కాంగ్రెస్ నాయకులు గూండాయిజం చేస్తూ రాత్రికి రాత్రే గద్దె నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతిగా బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఉషా దయాకర్‌రావు ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. ర్యాలీగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్తుండగా, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకున్నా రు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుని తోపులాట జరిగింది. ఉషా దయాకర్‌రావు కొంత ఆస్వస్థతకు గురయ్యారు. నియోజకవర్గ వ్యా ప్తంగా బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేయడంపై ఉషా దయాకర్‌రావు అభ్యంతరం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలని ఎర్రబెల్లి ఉషా దయాకర్‌రావు డిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్‌లో ఝాన్సీరెడ్డిపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. విదేశీయురాలైన ఝాన్సీరెడ్డికి భారత పౌరసత్వం ఉన్నదా? అని ప్రశ్నించారు.