BRS President KCR | సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ కంపెనీలో జరిగిన అగ్ని ప్రమాదంపై బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
చందాపూర్ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం పట్ల సిద్ధిపేట ఎమ్మెల్యే టీ హరీశ్ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయ పడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించడానికి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.