CM KCR | పొలం గట్టున కిక్కిరిసిన జనం.. అల్లంత దూరం నుంచి డాబా ఎక్కి మరీ కేసీఆర్‌ను చూసి మురిసింది తెలంగాణ పల్లె.. అభిమాన నాయకుడి మాట వినేందుకు ట్రాక్టర్లపై చీమల దండులా తరలివచ్చిన జనం.. కేసీఆర్ మాట్లాడుతుంటే ఒకటే ఈలలు, చప్పట్లు, కేరింతలు, తీన్మార్ డ్యాన్సులు! ఇవీ.. శుక్రవారం బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించిన మహబూబాబాద్, వర్ధన్నపేట, పాలేరులో కనిపించిన దృశ్యాలు. ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఎన్నికల సభలు కావు.. విజయోత్సవ సభలకు తరలివచ్చినట్టుగా కనిపించాయి.
శుక్రవారం మహబూబాబాద్‌లో నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్వాదసభ ప్రాంగణం పూర్తిగా నిండిపోవడంతో దూరాన నిలబడి బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని వింటున్న ప్రజలు.
శుక్రవారం మహబూబాబాద్‌లో ప్రజా ఆశీర్వాదసభ ప్రాంగణం సమీపంలోని ఇల్లెక్కి మరీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న ప్రజలు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మెచ్చిన జనం.. సీఎం కేసీఆర్‌పై అభిమానంతో మహబూబాబాద్ సభకు ఇలా తరలివచ్చారు..
మహబూబాబాద్ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి జైకొడుతున్న యువత.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జీళ్లచెరువు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా ఉత్సాహంతో ఈల వేస్తున్న మహిళ.
వరంగల్ నగర శివారు భట్టుపల్లిలో వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాదసభలో బీఆర్ఎస్ పార్టీ జెండాతో అభిమాని ఆనందం.
వరంగల్ నగర శివారు భట్టుపల్లిలో వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజా ఆశీర్వాదసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగానికి జైకొడుతున్న జనం.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జీళ్లచెరువు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి యువత కేరింత.
పాలేరు నియోజకవర్గం కూసుమంచి మండలం జీళ్లచెరువు సభలో సీఎం కేసీఆర్ ప్రసంగానికి చేతులెత్తి సంఘీభావం తెలుపుతున్న జనం.
వరంగల్ నగర శివారు భట్టుపల్లిలో సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటున్న వృద్ధులు.
మహబూబాబాద్ సభలో చిందులేస్తున్న మహిళలు.