హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కేటీఆర్ రాఖీయిజమా? సీఎం రేవంత్రెడ్డి రౌడీయిజమా? ఎటువైపు ఉందాం? అని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణలో ప్రోత్సహిస్తున్న రాఖీ సంసృతిని కోరుకుందా మా? సీఎం రేవంత్రెడ్డి ప్రోత్సహిస్తున్న ప్రమాదకర రౌడీ సంసృతిని కోరుకుందామా? తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.
మహిళా జర్నలిస్టులు అనే కనీస విచక్షణ లేకుండా, అసభ్యకరంగా ప్రవర్తించినా, అసెంబ్లీలో మహి ళా శాసనసభ్యులని అగౌరవపర్చినా బారాఖూన్ మాఫ్ అనేలా వాతావర ణం మారిపోవటం విషాదకరమని అన్నారు. ఆడబిడ్డలు తమ సోదర సమానుడైన నాయకుడికి రాఖీకడితే నేరమైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని గౌరవించకుండా ప్రవర్తించడం..
ఆఖరుకు రాఖీ సంసృతిని అవమానించేలా సీఎం రేవంత్రెడ్డి వక్రబుద్ధిని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాంసృతిక వారసత్వాన్ని, సామాజిక అస్థిత్వాన్ని దెబ్బతీయమే సీఎం రేవంత్రెడ్డి పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి కుట్రపూరిత వ్యూహాలను తిప్పికొట్టి తెలంగాణ అస్థిత్వాన్ని నిలబెట్టేందుకు మరోసారి ఐక్యపోరాటాలకు సిద్ధం కావాల్సిన వాతావరణం నెలకొన్నదని పేర్కొన్నారు.