BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఈ ఏప్రిల్ 27వ తేదీకి 25 ఏండ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇక రజతోత్సవ సభకు సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లాల నాయకులతో కేసీఆర్ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జిల్లాల్లో కూడా రజతోత్సవ సభ సన్నాహక సమావేశాలు, వాల్ రైటింగ్స్‌తో పాటు తదితర కార్యక్రమాలు చురుకుగా కొనసాగుతున్నాయి.
ఇక రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు కళాకారులు కూడా నడుం బిగించారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ రజతోత్సవ సభ పాటను రూపొందించారు. గులాబీ జెండా పట్టి.. గుండెలకు హత్తుకుందాం.. అంటూ రసమయి తన గాత్రంతో దుమ్మురేపారు. ఊరు వాడా కదులుదాం.. ఓరుగల్లుకు పోదాం. గులాబీ జెండా.. కేసీఆరే మనకు అండా దండా అంటూ రసమయి ఆలపించారు.
ఇక ఈ పాటలో కేసీఆర్ పదేండ్ల ప్రభుత్వంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తావించారు. పోదాం ఎంత దూరమైన పోదాం.. ప్రజల కోసం పని చేయాలి.. ప్రజల హక్కుల కోసం పని చేయాలి.. వారి ఆశలు అడియాశలు కాకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణనే బీఆర్ఎస్ ప్రథమక కర్తవ్యం.. అని కేసీఆర్ చెప్పిన మాటలను కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం ఈ పాట తెలంగాణను షేక్ చేస్తోంది. మరి మీరు కూడా ఆలకించండి..
గులాబీ జెండా పట్టి..
గుండెలకు హత్తుకుందాం.ఊరు వాడా కదులుదాం..
వరంగల్లుకు పోదాం.గులాబీ జెండా..
కేసీఆరే మనకు అండా దండా.దుమ్మురేపుతున్న రసమయి పాట 🎶🔥
చలో వరంగల్
🗓️ తేదీ: ఏప్రిల్ 27
📍 వేదిక: ఎల్కతుర్తి, హనుమకొండ.#25YearsOfBRS#BRSat25 pic.twitter.com/1uMsVlFSHt— BRS Party (@BRSparty) April 12, 2025