BRS Party | బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డల్లాస్ పార్టీ 25 ఏండ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పురస్కరించుకొని జూన్ 1 డల్లాస్‌లోని డీఆర్ పెప్పర్ అరేనా వేదికగా జరుగనున్న ఈ సంబురాలకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు.
ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సాయంత్రం 8 గంటలకు డల్లాస్ చేరుకోనున్నారు. పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలకడానికి బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. అమెరికాలో వివిధ రాష్ట్రాలలో ఉన్న తెలుగు వారందరూ డల్లాస్‌కి చేరుకుంటున్నారు. అదే విధంగా డల్లాస్‌లో ఉన్న తెలుగు వారు అమెరికా నుంచి వస్తున్న వారందరికీ ఆతిథ్యం ఇస్తున్నారు. కేసీఆర్ పాలనలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, అమలు చేసిన వినూత్న విధానాలతో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగింది. కేసీఆర్ నాయకత్వంలో కేటీఆర్ దూరదృష్టితో, తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చి, రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలపగలదని గట్టి విశ్వాసం. పట్టణం నుండి పల్లె వరకు, ప్రతి తెలంగాణ బిడ్డ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలి. ఈ రజతోత్సవం ఒక కొత్త ఉద్యమానికి నాంది కావాలి.. అభివృద్ధి, సమానత్వం, స్వాభిమానం కోసం అందరూ కేటీఆర్ రాక గురించి చూస్తున్నారు అని మహేష్ బిగాల తెలిపారు.
బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమావేశం ఏర్పాట్లు కొమెరికా సెంటర్లో చివరి దశకు చేరుకున్నాయు. సమావేశ ఏర్పాట్లను ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల, బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ చైర్మన్ మహేశ్ తన్నీరు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు.