BRS Party | హైదరాబాద్ : తెలంగాణ భవన్లో ఈ నెల 17వ తేదీన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశానికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు.