BNS|యూరియా కొరతపై రిపోర్టింగ్ చేస్తున్న టీన్యూస్ రిపోర్టర్ సాంబశివరావు మీద అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై తెలంగాణ డీజీపీ జితేందర్‌కు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా బహిరంగ లేఖ రాసింది. తెలంగాణలో అనుముల వారి రాజ్యాంగం అమలవుతోంది అని తెలుసు.. ఈ మధ్య భారతీయ న్యాయ సంహిత స్థానంలో, అనుముల న్యాయ సంహిత ఏమన్నా తెచ్చారా సర్అని నిలదీసింది.
యూరియా కొరత మీద రిపోర్టింగ్ చేస్తున్న టీ న్యూస్ విలేకరి సాంబశివ రావు మీద స్థానిక కాంగ్రెస్ మంత్రి ప్రోద్బలంతో పోలీసులు ఒక అక్రమ కేసు పెట్టారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. కానీ అందులో పెట్టిన సెక్షన్లలో బీఎన్ఎస్ సెక్షన్ 151 కూడా పెట్టారని పేర్కొంది. రాష్ట్రపతి, గవర్నర్ల మీద దాడి చేస్తే బీఎన్ఎస్ సెక్షన్ 151 పెడతారని గుర్తుచేసింది. ఈ కేసులో బీఎన్ఎస్ 151 కింద కేసు పెట్టడం ఏమిటి సర్ అని ప్రశ్నించింది. ఒకప్పుడు దేశంలోనే అత్యుత్తమ పోలీస్ ఫోర్స్‌గా పేరు తెచ్చుకున్న తెలంగాణ పోలీస్‌ను ఈ గుంపు మేస్త్రి & హోం మినిస్టర్ ఇంకెంత దిగజార్చుతాడని మండిపడింది.
FIR on TNEWS Reporter