Niranjan Reddy | హైదరాబాద్ : రాష్ట్రంలో రుణమాఫీ కానీ రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. లక్ష కానీ, లక్షన్నరలోపు కానీ బ్యాంకులో రుణం తీసుకొని ఉండి, మీకు రుణమాఫీ జరగకపోతే ఈ 8374852619 వాట్సప్ నంబర్‌కి మీ వివరాలు పంపాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. మా తెలంగాణ భవన్లో ఇద్దరు అధికారులను ఈ సమస్య మీదనే నియమించాం అని ఆయన తెలిపారు.
తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ పేర పట్టాదార్ పాస్ బుక్ కలిగి ఉండి, అదే పాస్ బుక్ మీద రుణం పొంది ఉండి, లక్ష కానీ, లక్షన్నర లోపు కానీ.. మాఫీ కాకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌కు ఆ వివరాలు పంపొచ్చు అని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఏ సర్వే నంబర్ మీద రుణం పొందారు.. ఏ గ్రామం, ఏ బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారు అనే వివరాలతో ఇతర విషయాలను 8374852619 అనే నంబర్‌కు వాట్సాప్ చేయాలని సూచించారు. వివరాలతో మీ రిమార్క్స్ కూడా రాయండి. రుణమాఫీ ఎందుకు కాలేదు.. అధికారులు ఏమన్నారు..? వంటి డిటెయిల్స్ రాసి పంపించండి అని నిరంజన్ రెడ్డి కోరారు.
ఈ వివరాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించి మాట్లాడుతాం. చర్చకు పెడుతాం. ప్రభుత్వం ఏం చెబుతదో ఆ వివరాలన్నింటిని సమాజానికి చెబుతాం. ప్రత్యక్షంగా మాటలు అవసరం లేదు.. ఎంత మందికి వచ్చాయి.. ఎంత మందికి రాలేదో తెలుసుకుందాం. రుణమాఫీ కాని వారికి కూడా వచ్చినట్లు చెబుతూ రైతులను, ప్రజలను మోసం చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సర్కార్ దుర్మార్గాన్ని ఎండగడుదాం. 2 లక్షల లోపు రుణాలను ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామన్నారు. మరి రూపాయికి బదులు అమెరికా డాలర్లు తీసుకొచ్చి చేస్తారేమో చూద్దాం అని రేవంత్ సర్కార్‌పై నిరంజన్ రెడ్డి సెటైర్లు వేశారు.
అర్హులై రుణమాఫీ జరగని రైతులకు బీఆర్ఎస్ టెక్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ – 8374852619
అర్హులైన రైతులు లక్షన్నరలోపు బ్యాంకులో రుణం తీసుకొని ఉండి, మీకు రుణమాఫీ జరగకపోతే ఈ వాట్సప్ నంబర్‌కి మీ వివరాలు పంపండి.. మా తెలంగాణ భవన్లో ఇద్దరు అధికారులను ఈ సమస్య మీదనే నియమించాం – సింగిరెడ్డి నిరంజన్… pic.twitter.com/1bgFb6zOe5
— Telugu Scribe (@TeluguScribe) August 5, 2024
ఇవి కూడా చదవండి..
KTR | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గొడ్డు కారంతో భోజనం.. మండిపడ్డ కేటీఆర్
Nagarjuna Sagar | నాగార్జునసాగర్‌లో జలకళ.. ఆరు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
KTR | స్వయంగా ముఖ్యమంత్రే ఆడబిడ్డలను అవమానిస్తుంటే.. తామేమీ తక్కువకాదనేలా పోలీసులు: కేటీఆర్