BRS Party | న్యూఢిల్లీ : రాజ్యసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానాలను డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌కు అందజేశారు. గోదావరిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించే బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించాలని రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్ రెడ్డి, దీవకొండ దామోదర్ రావు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. ఈ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు నష్టం చేకూర్చుతుందని నోటీసుల్లో పేర్కొన్నారు. సభా కార్యకలాపాలు వాయిదా వేసి… బనకచర్లపై చర్చించాలన్న బీఆర్ఎస్ ఎంపీలు కోరారు.
ఇక ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుపై అధికార పార్టీ కాంగ్రెస్ సైలెంట్ గా ఉండడంతో.. బీఆర్ఎస్ పార్టీ పోరుబాట పట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రయోజనాలను రేవంత్ రెడ్డి ఏసీ సీఎం దగ్గర తాకట్టు.. ఈ ప్రాంత రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే బనకచర్ల వల్ల తెలంగాణకు జరిగే అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ పలు వేదికలపై సవివరంగా వివరించింది.
BRS Party has given an adjournment motion in the Rajya Sabha and asked for a discussion on the Godavari-Banakacherla Project, which diverts water from basins thereby affecting the interests of Telangana.
BRS Parliament floor leader K.R. Suresh Reddy moved the motion today. pic.twitter.com/qTnLSBs34C
— BRS Party (@BRSparty) August 6, 2025