KCR | హైదరాబాద్ : కుల, వర్ణ, లింగ వివక్షను వ్యతిరేకించిన సామాజిక అభ్యుదయ వాది, వీరశైవ లింగాయత్ ధర్మ వ్యవస్థాపకుడు, బసవేశ్వరుని జయంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా బసవన్నచేసిన సామాజిక కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. ధార్మిక ప్రవచనాలు, వచన సాహిత్యం, కార్యాచరణ ద్వారా సమానత్వం కోసం పాటుపడిన సామాజిక విప్లవకారుడు బసవన్నఅని కొనియాడాదరు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన దార్శనిక పాలకుడిగా ప్రజల మన్ననలు అందుకున్నాడని తెలిపారు. బసవేశ్వరుని ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కేసీఆర్ తెలిపారు.