KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరికాసేపట్లో ఎర్రవల్లి నుంచి హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు బయల్దేరారు. ఉదయం 11 గంటలకు కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఈ క్రమంలో బీఆర్కే భవన్ వద్దకు పార్టీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.
ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహముద్ అలీ.. కేసీఆర్ వెంట విచారణకు హాజరు కానున్నారు.