KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌లోని బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు. సరిగ్గా ఉదయం 11 గంటలకు ఆయన బీఆర్కే భవన్ లోపలికి వెళ్లారు. మరికాసేపట్లో కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌ను విచారించనుంది. కేసీఆర్ వెంట ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పద్మారావు గౌడ్, బండారి లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మహముద్ అలీ ఉన్నారు.
కాళేశ్వరం పై కమిషన్ విచారణకు హాజరైన కేసీఆర్
ఈ నైపథ్యంలో బీఆర్కే భవన్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు https://t.co/pk6NJyqS0S pic.twitter.com/oB5oi9Q2HY
— Telugu Scribe (@TeluguScribe) June 11, 2025