BRS Party | హైదరాబాద్ : బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత వేటుపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్పీకర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. సుప్రీంకోర్టు డెడ్‌లైన్ ప్రకారం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాల్సిందేనని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే కోర్టు ధిక్కరణ చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్తున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ చేరలేదు.. మేము బీఆర్ఎస్ నుండి ఎవరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదు అని వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ ఘాటుగా స్పందించింది. ఉప ఎన్నికలు వస్తాయనే భయం అప్పుడే కోమటిరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో మొదలైంది అని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. అందుకే కాంగ్రెస్ నేతలు మతి భ్రమించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది. ఈ సందర్భంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పేర్లు ప్రస్తావిస్తూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ పలు ప్రశ్నలు సంధించింది. ఈ పది మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు ఆహ్వానించారు..? ఎవరు చేర్చుకున్నారు..? అని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించింది.
1) పార్లమెంటు ఎన్నికల్లో దానం నాగేందర్‌కు కాంగ్రెస్ బీ-ఫాం ఇచ్చిన గాడిద కొడుకు ఎవడు?
2) ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిపాదనలు కాదని, అరికెపూడి గాంధీకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చిన సన్నాసి ఎవడు?
3) కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి, కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించిన సుప్పనాతి ఎవరు?
4) కాలె యాదయ్యకు కాంగ్రెస్ కండువాలు కప్పి, కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయించిన దగుల్బాజీ ఎవరు?
5) ఇంటికి వెళ్లి మరీ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి పిలిచి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో కండువా కప్పించిన పిట్టలదొర రేవంత్ రెడ్డి కాదా?
6) ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్ అయిన జగిత్యాల జీవన్ రెడ్డి రాజకీయంగా నా గొంతుకోశారని రోజూ దుమ్మెత్తిపోస్తున్నది సంజయ్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నందుకు కాదా?
7) బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్ళొద్దని బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిని బెంగళూరు తీసుకెళ్లి, కాళ్లు పట్టుకున్న చిల్లరగాడు ఎవడు?
8) ప్రకాష్ గౌడ్‌కు కాంగ్రెస్ కండువా కప్పి, దాన్ని దేవుడి కండువా అని అబద్ధాలాడిన నల్లికుట్లోడు ఎవడు?
9) గూడెం మహిపాల్ రెడ్డిని ఇంటికి పిలిపించుకుని కాంగ్రెస్ జెండా కప్పిన అష్టదరిద్రుడు ఎవడు?
10) ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుని కాంగ్రెస్‌లో చేర్చుకుని పత్రికల్లో పిచ్చి రాతలు రాయించి శునకానందం పొందినోడు ఎవడు?
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎవరూ చేరలేదు.. మేము బీఆర్ఎస్ నుండి ఎవరినీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోలేదు – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
అవ్ క్వార్టర్లో వాటర్ రెడ్డి..!
1) పార్లమెంటు ఎన్నికల్లో దానం నాగేందర్‌కు కాంగ్రెస్ బీ-ఫాం ఇచ్చిన గాడిద కొడుకు ఎవడు?
2) ప్రతిపక్ష… pic.twitter.com/ckEq6ois0x
— BRS Party (@BRSparty) August 1, 2025