హైదరాబాద్: బీఆర్ఎస్ (BRS) పార్లమెంటరీ పార్టీ, శాసనసభాపక్షంతోపాటు రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం ప్రారంభమైంది. తెలంగాణ భవన్లో (Telangana Bhavan) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (CM KCR) అధ్యక్షతన ఈ విస్తృతస్థాయి సమావేశం జరుగుతున్నది. సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికల ఏడాది కావడంతో ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు, పార్టీ కార్యకలాపాలు, తదితర అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. పార్టీ కార్యాచరణ ఎలా ఉండాలనే విషయాలపై నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, సమావేశం ప్రారంభమైన వెంటనే ఇటీవల మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు సీఎం కేసీఆర్, పార్టీ నేతలు నివాళులు అర్పించారు.