హైదరాబాద్, మే 5 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బస్సులు అందించిన ఆర్టీసీకి బీఆర్ఎస్ నాయకులు అద్దె చెల్లించారు. గతంలోనే రూ.8 కోట్లు చెల్లించగా, మంగళవారం రూ.1,55,46,000 చెక్కును తెలంగాణ భవన్ ఇన్చార్జి రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, ఎస్సీ కమిషన్ మాజీ మెంబర్ విద్యాసాగర్‌రావు, బీసీ కమిషన్ మాజీ మెంబర్లు కిశోర్‌గౌడ్, తుంగ బాలు, రాష్ట్ర నేత కురువ విజయ్‌కుమార్ ఆర్టీసీ ఈడీకి అందజేశారు. మొత్తం రూ.9,55,46,000 అద్దె చెల్లించనట్టు తెలిపారు.