BRS : పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ విధానానికి ఓటేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ‘సర్’తో పాటు పార్టీ సమన్వయకర్తల నియమాకాలపై చర్చించారు. మంగళవారం ఎర్రవల్లిలోని నివాసంలో దాదాపు ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ప్రతి నియోజక సమన్వయ కర్తలను నియమించారు.
1) కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల చేపట్టిన సర్ (SIR) ప్రక్రియతో పాటు ఓటర్ జాబితా సవరణ, తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్‌గా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పార్టీ సభ్యత్వం కూడా డిజిటలైజేషన్ పద్దతిలో జరపాలని బీఆర్ఎస్ ప్రార్టీ ప్రధాన కార్యదర్శులు అభిప్రాయ పడ్డారు.
2) ప్రతి నియోజకవర్గానికి, రాష్ట్ర కమిటీ నుండి సభ్యత్వ సమన్వయ కర్తను నియమించాలని నిర్ణయించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి అధ్యక్షతన ముగిసిన సమావేశం
దాదాపు ఆరు గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక అంశాల గురించి ప్రస్తావించిన కేసీఆర్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన SIR ప్రక్రియతో పాటు, వోటర్ లిస్టు సవరణ తదితర కార్యాచరణ మొత్తం డిజిటల్ ప్రక్రియలో జరుపుతున్న నేపథ్యంలో… https://t.co/Lt6KciY0BD pic.twitter.com/zgkwScj5Sn
— Telugu Scribe (@TeluguScribe) May 12, 2026
3) ప్రతీ మండలానికి మున్సిపల్ బాడీల వారీగా ‘సభ్యత్వ నమోదు కార్యక్రమం సజావుగా నిర్వహించడానికి, సభ్యత్వ సమన్వయ కమిటీ’లను రెండు మూడు రోజుల్లోగా నియమించాలని తీర్మానించారు.
4) డిజిటలైజేషన్ పద్దతిలో సభ్యత్వ నమోదు చేయాలని భావించినందున రాష్ట్రంలోని 35,655 పోలింగ్ కేంద్రాలో.. బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున మొత్తం 71,310 మంది పార్టీ కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. డిజిటల్ సభ్యత్వానికి సంబంధించిన విధి విధానాలపై శిక్షణ ఇవ్వాలని సమావేశంలో పాల్గొన్న నేతలు అభిప్రాయ పడ్డారు.
5) పార్టీ సభ్యత్వ నమోదును డిజిటల్ పద్దతిలో చేపట్టేందుకు తగిన శిక్షణా శిబిరాలను పార్టీ ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో కొనసాగించాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం పలు జిల్లాలకు ఇంచార్జీలను నియమించారు. ఏ జిల్లాలకు ఎవరు ఇంజార్జీగా వ్యవహరిచనున్నారంటే..
ఖమ్మం, కొత్తగూడెం : తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిరిసిల్ల : జీవన్ రెడ్డి, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి
ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్ : సత్యవతి రాథోడ్, మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి
జనగాం, హనుమకొండ, వరంగల్ : పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే, ప్రధాన కార్యదర్శి.
మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట : గ్యాదరి బాలమల్లు, ప్రధాన కార్యదర్శి.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు : గంగాధర్ గౌడ్ మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
మంచిర్యాల, ఆసిఫాబాద్ : నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ ఎమ్మెల్సీ, ప్రధాన కార్యదర్శి.
ఆదిలాబాద్, నిర్మల్ : రావుల శ్రావణ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి.
వికారాబాద్, రంగారెడ్డి : సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే.
మహబూబ్‌నగర్, నారాయణపేట : మహమూద్ అలీ, మాజీ మంత్రి
గద్వాల్, నాగర్‌కర్నూల్, వనపర్తి : మెట్టు శ్రీనివాస్, కార్యదర్శి
మేడ్చల్-మల్కాజిగిరి,యాదాద్రి : పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎంఎల్సీ, డిప్యూటీ ఫ్లోర్ లీడర్
హైదరాబాద్ : తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే
నల్గొండ, సూర్యాపేట : ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి.