జల పరవళ్లు
జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. ఎగువన వర్షాలు కురువడం తోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూ రాల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది.
- కృష్ణా, భీమా, తుంగభద్ర నదుల పరవళ్లు
- జూరాల 29 గేట్ల ద్వారా నీటి విడుదల
- శ్రీశైలానికి 1.28 లక్షల క్యూసెక్కులు
గద్వాల, ఆగస్టు 1 : జూరాల ప్రాజెక్టుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ వస్తుంది. ఎగువన వర్షాలు కురువడం తోపాటు నారాయణపూర్ డ్యాం నుంచి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో జూ రాల ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. శనివారం జూరాల ప్రాజెక్టుకు పెద్దఎత్తున వరద నీరు వ చ్చి చేరుతుండడంతో జూరాల కృష్ణమ్మ నీటితో కళకళ లాడింది. సాయంత్రం వరకు జూరాలకు 1,70, 000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.90 మీటర్ల నీటి నిల్వ ఉంది. జూరాల ప్రాజెకు ్ట పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీ ఎంసీలు కాగా ప్రస్తుతం 8.415 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వఉంది. విద్యుదుత్పత్తికి 33,966 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి 1,70,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 29గేట్లు తెరిచి దిగువకు 1,46,018 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇన్‌ఫ్లో 1,70,000 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1,79,023 క్యూసెక్కులుగా నమోదైంది. భీమా నదికి వరద పెరగడంతో జూరాలకు వరద పెరిగే అవకాశం ఉంది. వరద ఉధృతి పెరిగితే రాత్రికి మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శ్రీశైలం @ 842.30 అడుగులు
నాగర్‌కర్నూల్/ శ్రీశైలం, ఆగస్టు 1: శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీ శైలానికి భారీగా వరదనీరు చేరుతోంది. శనివారం సాయంత్రానికి జూరాల క్రస్ట్ ద్వారా లక్షా 46వేల క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి ద్వారా 34వేల క్యూసెక్కులు వరద నీరు చేరుతోంది. మొత్తంగా లక్షా 80క్యూసెక్కులు జూరాల ప్రాజెక్టు నుంచి నీరు విడుదల కాగా శనివారం సాయంత్రానికి లక్షా 28,576 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకున్నది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 842.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి సా మర్థ్యం 215 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 65.32టీఎంసీలుగా నమోదైంది. కుడి, ఎడమ విద్యుదుత్పత్తి
కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కావడం లేదు. ప్రా జెక్టుకు కృష్ణా పరీవాహక ప్రాంతాల నుంచి శనివారం 80వేల క్యూసెక్కులపైగా నీటిమ ట్టం పెరిగిందని అధికారులు వెల్లడించారు. గతేడాది ఆగస్టు 5వ తేదీ నాటికి శ్రీశైలం ప్రా జెక్టుకు 2,32,164 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రా గా, 877.6 అడుగులుగా నమోదైంది. నీరు 176.33 టీఎంసీలుగా నమోదైంది.
తుంగభద్రకు పెరుగుతున్న ఇన్‌ఫ్లో
అయిజ, ఆగస్టు 1 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో తుంగ (గాజనూరు) డ్యాం పూర్తిగా నిండటంతో గేట్లెత్తి 75,286 క్యూసెక్కులు వదిలారు. దీంతో శనివారం టీబీ డ్యాంకు 24,968 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్‌ఫ్లో 3,003 క్యూసెక్కులుగా నమోదైంది. తాగునీటి అవసరాల కోసం 3,003 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. డ్యాం ఫుల్ లెవల్ 105.788 టీఎంసీలకుగానూ 38.688 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు డ్యాం సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు. వరద రాకతో గద్వాల జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
Actor Brahmaji | ‘ప్రొటెస్ట్ అనేది కొత్త వృత్తి’.. నటుడు బ్రహ్మాజీ వివాదాస్పద పోస్ట్.. నెటిజన్ల ఆగ్రహం!
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

