హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ) : యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) కొత్త ముసాయిదా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నదని విద్యాశాఖ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆక్షేపించారు. రాష్ట్రాల హకులను హరించే విధంగా ఉన్నదని విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు యూజీసీ కొత్త నిబంధనలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల్లో సబితారెడ్డితోపాటు మాజీ ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ దాసోజు శ్రవణ్, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, ఒంటెద్దు నరసింహారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు జీ దేవీప్రసాద్, చిరుమళ్ల రాకేశ్, క్రిశాంక్, ఆంజనేయగౌడ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, దూదిమెట్ల బాలరాజ్యాదవ్, కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు, బమ్మెర రామ్మూర్తి పాల్గొన్నారు. అనంతరం సబితారెడ్డి మీడియాతో మాట్లాడారు. యూజీసీ కొత్త నిబంధనల ప్రకారం.. యూనివర్సిటీ వీసీల ని యామకాలు పూర్తిగా గవర్నర్ చేతిలోకి వెళ్తున్నదని, గవర్నర్ ద్వారా కేంద్రం పెత్త నం చేలాయించాలని చూస్తున్నదని మండిపడ్డారు. దీనిని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందని స్పష్టంచేశారు. ఈ సిఫారసులను వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ఫెడరల్ స్ఫూర్తిని కేం ద్రం మంటగలిపితే ఊరుకోబోమని హెచ్చరించారు.
యూజీసీ ముసాయిదాపై సుదీర్ఘంగా చర్చించామని, 11వ క్లాజుల్లో చాలా వరకు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. వీసీ, ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలతోపాటు హాజరు పద్ధతులపై రాష్ర్టాల హక్కులను హరించేలా ఉన్నాయని విమర్శించారు. బీఆర్ఎస్ అభిప్రాయాన్ని యూజీసీ వెబ్సైట్లో శుక్రవారం అప్లోడ్ చేస్తామని వివరించారు.